Tuesday, 29 October 2024

నోటిఫికేషన్‌ జారీకి నిర్ణయం ● 16,347 టీచర్‌ పోస్టులు భర్తీ

    కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైన మెగా డీఎస్సీ పట్టాలెక్కుతోంది. నవంబరు 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 16,347 టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించగా దీనికి అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పోస్టుల రోస్టర్‌ వివరాలు సమర్పించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు నవంబరు 2న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు విడుదల చేసిన తర్వాత డీఎస్సీ ప్రకటిస్తే కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకునే వీలు కలుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మూడు నుంచి నాలుగు నెలల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వేసవి నాటికి కొత్త టీచర్లకు శిక్షణ పూర్తిచేసి, వచ్చే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే సమయానికి వారికి పాఠశాలల్లో బాధ్యతలు అప్పగించేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొత్త టీచర్లు వస్తే ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయ సూళ్ల ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. రాష్ట్రంలో దాదాపు 12వేల పాఠశాలలు ఒకే టీచర్‌తో నడుస్తున్నాయి. ఆ ఒక్క టీచర్‌ సెలవు పెడితే ఆ రోజు బడి మూసేయాల్సి వస్తోంది. కొత్త డీఎస్సీలో చాలా పాఠశాలలకు రెండో టీచర్‌ను ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టింది. అయితే కొత్తగా టెట్‌ రాసేవారికి అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరడంతో మూడు నెలలు వాయిదా వేసింది. ఇటీవల టెట్‌ ముగియడంతో ఇప్పుడు డీఎస్సీకి సిద్ధమైంది.

Ap mega dsc syllabus || #megadsc notification 2025 || Ap mega dsc syllabus

  Government of Andhra Pradesh Department of School Education` `State Council of Educational Research & Training` ------------- *SGT Syl...