Sunday, 3 November 2024

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ 2024 ఫలితాలు విడుదల Ap tet results 2024 #aptetresults #tetresults

 ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు సోమవారం నవంబర్ 4వ తేదీన విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 21న ఏపీలో టెట్‌ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పరీక్షల ఫైనల్ కీ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిపై అభ్యంతరాలను స్వీకరించిన విద్యాశాఖ ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది.

ఏపీ టెట్ పరీక్షలు మొత్తం 17 రోజల పాటు జరిగాయి. ప్రతి రోజు 2 విడతలుగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా, 3,68,661 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఫలితాలు వెలువడాల్సి ఉన్నా విద్యాశాఖ మంత్రి అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేశారు. దీంతో ఎట్టకేలకు ఫలితాలను విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. టెట్ ఫలితాలు విడుదల కావడంతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 6వ తేదీన డిఎస్సీ 2024 నోటిఫికేష్ విడుదల కానుంది.

ఫలితాలు ఇలా..

Step 1 : టెట్ రాసిన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

No comments:

Post a Comment

Bihar Home Guard Vacancy 2025 || #bihar police vacancy ||bihar police new vacancy

Bihar Home Guard Vacancy 2025  Bihar Police Recruitment 2025 for 15,000 posts of Home Guard. Candidates with 10TH or 12TH Can Apply Online. ...